Saturday, November 16, 2024

24 గంటల్లో రూ.10,17,940 నగదు సీజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల నిర్వహిస్తున్న తనికీలో గడిచిన 24 గంటల వ్యవధిలో రూ. 10,17,940నగదు, రూ.61,481విలువైన గల ఇతర వస్తువులతో పాటు 24.06 లీటర్ల లిక్కర్ ను సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్ రోస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 3 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించి నట్లు, 2 ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా 12 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు.

జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం రూ. 12,97, 39,560 నగదు, రూ.1,86,74,708ల విలువ గల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేసినట్లు రోనాల్ రోస్ తెలిపారు. 19,822.71 లీటర్ల మద్యం పట్టుకోవడంతో పాటు 147 కేసులు నమోదు చేసి 141 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. నగదు ఇతర వస్తువులపై ఇప్పటీ వరకు 296 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించామని, 194 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేశారని , 2450 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి వివరించారు .ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా రూ. 2,88,06,740, పోలీస్,ఐటీ వారురూ. 9,93,53,130, -, ఎస్ ఎస్ టీ బృందాల ద్వారా రూ.15 ,79, 690 నగదు సీజ్ చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News