హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.16.15 కోట్ల నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. నగరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు వివిధ ప్రాంతాల్లో జరిగిన తనిఖీలలో రూ.16.15 కోట్ల నగదుతో పాటు రూ.7.15 కోట్ల విలువజేసే ఇతర వస్తువులు, 21,164 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు.
ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువులపై వచ్చిన 456 ఫిర్యాదులను పరిష్కరించామని,303 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామన్నారు. లైసెన్స్ గల 2980 ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు, ఎంసిసి ఉల్లంఘనలపై 17 ఫిర్యాదులు అందగా, వాటిపై చర్యలు తీసుకున్నట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారుఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు ఫ్లయింగ్ స్కాడ్ బృందాల ద్వారా రూ.3,26,69,235, పోలీసు,ఐటీ శాఖ ద్వారా రూ.12,72,47,180,ఎస్‌ఓటీ బృందాల ద్వారా రూ.15,79,690 నగదు సీజ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు.