Thursday, January 23, 2025

రైతులకు ధాన్యం నగదు బదిలీ

- Advertisement -
- Advertisement -
రూ. 1500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం 
పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్: నేటి వరకు ధాన్యం కొనుగోలు చేసి ఓపిఎంఎస్ లో నమోదైన ప్రతి రైతుకు నగదు బదిలీ చేశామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం రూ. 1500 కోట్లను విడుదల చేయడంతో ఇప్పటివరకు 11444 కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేశామని చెప్పారు. ఓపి ఎమ్మెస్‌లో నమోదైన వెంటనే డబ్బులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు 11 లక్షల పదివేల మంది రైతుల నుండి 65.82 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ దాదాపు ముగిసిందని కేవలం ఒక 100 సెంటర్లో మాత్రమే అక్కడక్కడ కొనుగోలు జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం గా పని చేస్తున్నానడానికి ఈ ధాన్యం సేకరణ నిదర్శనం అన్నారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కెసిఆర్ ఆదేశంతో కొనుగోలు చేపట్టామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News