Wednesday, January 22, 2025

గొర్రెలకు బదులు నగదు బదిలీ…

- Advertisement -
- Advertisement -

ఫైలెట్ ప్రాజెక్టుగా నల్లగొండ, యాదాద్రి జిల్లాల ఎంపిక
విజయవంతంగా శనివారం గొర్రెల పంపిణీ పథకం కింద నగదు బదిలీ చేసిన ప్రభుత్వం
7,600 మంది లబ్ధిదారులకు రూ.93 కోట్ల 76 లక్షల నగదు జమ

 

మనతెలంగాణ/హైదరాబాద్:  మునుగోడు నియోజకవర్గంలో గొర్రెల పంపిణీ పథకం కింద గొర్రెలకు బదులు నగదు బదిలీ చేసేలా ఫైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నల్లగొండ, యాదాద్రి జిల్లాల కలెక్టర్‌లు విజయవంతంగా నగదు బదిలీ కార్యక్రమాన్ని శనివారం పూర్తి చేశారు. ఈ నియోజకవర్గంలో సుమారు 7600 మంది లబ్ధిదారులకు రూ.93 కోట్ల 76 లక్షల నగదు వారి అకౌంట్‌లలో జమచేశారు. నల్లగొండ జిల్లాలోని 5,600 మందికి రూ.69 కోట్ల 9లక్షల నగదు జమకాగా, యాదాద్రి జిల్లాలోని 2 వేల మందికి రూ.24 కోట్ల 67 లక్షల నగదు అధికారులు జమచేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి అవకతవకలు జరగకుండా లబ్ధిదారులే సొంతంగా గొర్రెలను కొనుగోలు చేసేలా ఈ నగదును బదిలీ చేసేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ముందుగా తమ జిల్లాల్లో ఫైలెట్ ప్రాజెక్టు కింద అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆయా జిల్లాల కలెక్టర్‌లు ప్రభుత్వానికి లేఖ రాయగా ప్రభుత్వం దానికి ఆమోదం వేసింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు అధికారులు జమ చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాల లబ్ధిదారులను ఈ పథకం కింద ప్రభుత్వం ఎంపిక చేసింది. యాదాద్రి జిల్లాలో రెండు మండలాలు, నల్గొండలో 4 మండలాలు పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. గొర్రెల పంపిణీలో నగదును బదిలీ చేయాలన్న అంశానికి వారంరోజుల పాటు కసరత్తు చేసిన లబ్ధిదారుల ఎంపికతో పాటు నగదు బదిలీ కార్యక్రమాన్ని వారంరోజుల్లో పూర్తి చేశారు.

మొదటి గొర్రెల పథకంలో పలు అక్రమాలు, గొర్రెల రీసైక్లింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో గొర్రెలకు బదులు నగదు బదిలీ చేయాలన్న ప్రతి పాదనను అధికారులు ప్రభుత్వం ముందు ఉంచారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నగదు బదిలీకి పచ్చజెండా ఊపినట్టుగా తెలిసింది. గొర్రెల యూనిట్ ఒక్కింటి ధర 1.7 లక్షలు కాగా, అందులో లబ్ధిదారుల వాటా రూ.17 వేలు పోనూ మిగతా రూ.1.58 లక్షలను వారి ఖాతాల్లో వేశారు.

ఫైలెట్ ప్రాజెక్టు కింద ఈ రెండు జిల్లాలు
షీప్ అండ్ గోట్ ఎండి, పశుసంవర్ధక శాఖ సంచాలకులు, డా.ఎస్.రాంచందర్

యాదాద్రి భువనగిరి, నల్లగొండ కలెక్టర్ జిల్లాల కలెక్టర్‌లు నగదు బదిలీ పథకాన్ని తమ జిల్లాలో అమలు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై ప్రభుత్వం ఫైలెట్ ప్రాజెక్టుగా ఈ రెండు జిల్లాలను ఎంపిక చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు లబ్ధిదారుల గుర్తింపుతో పాటు నగదు బదిలీని విజయవంతంగా అమలు చేశాం. శనివారం సాయంత్రానికి లబ్ధిదారుల్లో అకౌంట్‌లలో నగదు జమచేశాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News