రూ 10000 అంతకు మించితే
న్యూఢిల్లీ : ఎస్‌బిఐ ఎటిఎంలలో రూ. పదివేలు అంతకు మించి సొమ్ము తీసుకోదల్చిన వారు ఇకపై కీలక విషయాన్ని పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎస్‌బిఐ అధికారిక ప్రకటన వెలువరించింది. ఈ నిబంధన ప్రకారం ఈ ఎటిఎంలలో నగదు కోసం వెళ్లేవారికి ముందుగా వారి నమోదిత సెల్‌ఫోన్‌లో ఒటిపి నెంబరు వస్తుంది.ఈ నెంబరును ఎంటర్ చేస్తేనే వారు పదివేలు అంతకు మించిన నగదును తీసుకునేందుకు వీలుంటుంది. ఎటిఎం కార్డులతో ఇతరుల ఖాతాల నుంచి సొమ్ముకాజేసి నిజాయితీపరులను ఖేదానికి గురి చేసే స్కామర్లకు చెక్‌పెట్టేందుకు ఎస్‌బిఐ ఎటిఎంలలో ఈ ఏర్పాట్లు చేశారు. లావాదేవీలను మరింత భద్రం చేసేందుకు ఈ మార్గం ఎంచుకునానమని తెలిపారు. ఒటిపిలను వెంటనే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తరువాతనే సొమ్ము తీసుకునే వీలుందని వివరించారు. అక్రమదార్ల వైరస్‌కు ఈ ఒటిపి నివారణ టీకా అవుతుందని కార్డు పిన్ నెంబరు దీనితో పాటు ఒటిపి నెంబరు కలిపి కొట్టాలని తెలిపారు. ప్రస్తుతానికి ఈ విధానం ఎస్‌బిఐ ఎటిఎంలలో అమలులోకి వచ్చింది.