Sunday, December 22, 2024

ఇక అన్ని ఆస్పత్రుల్లో ‘క్యాష్‌లెస్’ ట్రీట్‌మెంట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ప్రైవేటు ఆస్పత్రులకు సంబంధించి బీమా కంపెనీలు కీలక నిర్ణయాన్ని ప్రకటించాయి.ఆరోగ్య బీమా తీసుకున్న వారు ఇకనుంచి అన్ని ఆస్పత్రుల్లో ‘క్యాష్‌లెస్’సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. గురువారంనుంచే ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు ‘ ది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్’ వెల్లడించింది. జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.ఇన్సూరెన్స్ పాలసీ నెట్‌వర్క్ జాబితాలో లేని ఆస్పత్రుల్లో కూడా క్యాష్‌లెస్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే నెట్‌వర్క్ హాస్పిటల్ జాబితాలో లేని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్ సదుపాయాన్ని పొందడానికి 48 గంటల ముందు సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి తెలియజేయాలి. అత్యవసర సమయాల్లో అయితే ఆస్పత్రిలో చేరిన 48 గంటల్లోగా సమాచారాన్ని చేరవేయాల్సి ఉంటుంది.

ఇన్సూరెన్స్ పాలసీ షరతులు, నిబంధనల ఆధారంగా క్లెయిమ్ వర్తిస్తుందని కౌన్సిల్ తెలియజేసింది. ప్రస్తుతం ఏదయినా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో మాత్రమే క్యాష్‌లెస్‌కు అనుమతి ఉంది. క్యాష్‌లెస్ సదుపాయం లేని చోట ట్రీట్‌మెంట్‌కు అయ్యే ఖర్చును జేబులోంచి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రీ యింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కూడా సంక్లిష్టంగా ఉండడం, రిఫండ్ ఆలస్యం కావడంతో కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకనుంచి ఈ సమస్యలుండవని కౌన్సిల్ చైర్మన్ తపన్ సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్యానెల్‌లో నమోదయినఆస్పత్రులు 40 వేలు మాత్రమే ఉన్నట్లు ఆయన చెప్పారు. క్యాష్‌లెస్ గురించి ఇప్పటికే ఆయా కంపెనీలు కస్టమర్లకు మెస్సేజిలు కూడా పంపుతున్నాయి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News