Monday, January 20, 2025

ఆర్డర్ వేసిన అమిత్ షా.. బిజెపిలో చేరిన చీకోటి ప్రవీణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ శనివారం భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. అమిత్ షా జోక్యంతో చికోటి ప్రవీణ్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. డికె అరుణ సమక్షంలో చికోటి ప్రవీణ్ బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. దేశవిదేశాలలో గ్యాంబ్లింగ్ క్లబ్‌లు, క్యాసినోలను నిర్వహించినందుకు క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రవీణ్, రాష్ట్ర పార్టీ నాయకత్వం నుండి ఆమోదం పొందినట్లు పేర్కొంటూ బిజెపిలో చేరారు. అయితే, ప్రవీణ్ ప్రవేశాన్ని బిజెపి నాయకులలో ఒక వర్గం వ్యతిరేకించింది. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, చీకోటి ప్రవీణ్‌కు పార్టీలో చేరే తొలి ప్రయత్నంలోనే నిరాశే మిగిలిన విషయం తెలిసిందే.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News