Monday, December 23, 2024

ఆయుధాల కేసు..పరారీలో చీకోటి ప్రవీణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీ లాల్‌దర్వాజ మహంకాళీ అమ్మవారిని దర్శించుకునే క్రమంలో క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ వ్యవహరించిన తీరు వివాదస్పదంగా మారిన సంగతి విదితమే. చీకోటి ప్రవీణ్‌కు చెందిన ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేకుండా ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఛత్రినాక పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో చికోటి ప్రవీణ్‌ను పోలీసులు ఎ1 నిందితుడిగాగా చేర్చారు. పోలీసులు అరెస్ట్ చేసిన ప్రవీణ్ ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీని రిమాండ్‌కు తరలించారు. అయితే ప్రస్తుతం చికోటి ప్రవీణ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. చికోటి ప్రవీణ్ గోవాకు పారిపోయి దాక్కున్నట్లు అనుమానిస్తున్నారు.ఇంకా రిమాండ్ రిపోర్టులో ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు రాకేష్ కుమార్, సుందర్ నాయక్, రమేష్ గౌడ్‌లు ఆయు ధాలు పట్టుకుని ప్రవీణ్ ఎక్కడికి వెళ్లినా అతని వెంట వస్తున్నారని పోలీసులు ఆరోపించారు.

“ముగ్గురు నిందితులు ప్రధాన నిందితుడిగా ఉన్న చీకోటి ప్రవీణ్‌కి సాయుధ సిబ్బంది సెక్యూరిటీ గార్డులుగా సేవ చేయడానికి అధికారం లేదని తెలియజేశారు. అయితే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు తాను ప్రతిదీ చూసుకుంటానని ఎ1 వారికి తెలియజేశారు. ముగ్గురు నిందితులు అందుకు అంగీకరించి అతనితో చేరారు” అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వెల్లడించారు. పెద్ద ఎత్తున జనాలు ఉండటాన్ని ఆసరాగా తీసుకుని ప్రవీణ్ అక్కడి నుంచి తప్పించు కున్నాడని.. అతని ముగ్గురు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులను అరెస్టు చేసి, వారి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు కోర్టు ముందు రిపోర్టును సమర్పించారు. ఇక, ప్రవీణ్‌ను పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News