Tuesday, November 5, 2024

కుల మత రాజకీయాలకు తెలంగాణలో తావులేదు: ఉప్పల శ్రీనివాస్ గుప్త

- Advertisement -
- Advertisement -

బిజెపి చిల్లర చేష్టలను మునుగోడు ప్రజలు తిప్పికొట్టాలి
యావత్ భారత ప్రజానీకం కెసిఆర్ నాయకత్వాన్ని కోరుతోంది
మునుగోడు ఎన్నికల ప్రచారంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గుప్త

Caste and religion politics have no place in Telangana

మన తెలంగాణ / హైదరాబాద్ : కుల మత రాజకీయాలు చేస్తున్న బిజెపికి తెలంగాణలో తావులేదని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. తెలంగాణ ప్రజలతో బిజెపి నాయకులు చెలగాటమాడుతున్నారని ఆయన విమర్శించారు. బిజెపి చిల్లర చేష్టలను మునుగోడు ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పగటి కలలు కంటున్న బిజెపి నాయకులకు మునుగోడులో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయని ఆయనన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రరెడ్డి గెలుపు కోసం ప్రతి ఆర్యవైశ్యుడు సమిష్టిగా కృషి చేయాలని కోరారు.

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మునుగోడు నియోజకవర్గంలో శ్రీనివాస్ గుప్త ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులను, కార్యకర్తలను కలిసి అనంతరం షాప్స్, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలోనూ మాట్లాడారు. ఆర్యవైశ్యులు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే ఒక్క టిఆర్‌ఎస్ పార్టీతోనే సాధ్యమని, ఆర్యవైశ్య సోదరులందరూ ప్రభాకర్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని గుప్త కోరారు. టిఆర్‌ఎస్ అభ్యర్తి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలన్నారు.

యావత్ భారత ప్రజానీకమే కెసిఆర్ నాయకత్వాన్ని కోరుతోందని ఆయనన్నారు. టిఆర్‌ఎస్ పార్టీతోనే మన ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం మునుగోడు మండల అధ్యక్షుడు వై.సురేష్ కుమార్ గుప్త, కార్యదర్శి ఎస్. రాము, ఉపాధ్యక్షులు జి.కిషన్, కోశాధికారి పి. శ్రీకాంత్, చినస్వామి, సుదర్శన్, పుల్లయ్య, నవీన్ కుమార్, ఈశ్వరయ్య, వెంకటేశ్వర్లు, జిందం వేణు, సాంబశివరావు, శ్రావణ్ కుమార్, మహేష్ గుప్త, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News