సర్వేకు స్వచ్ఛందంగా సమాచారం అందిస్తున్న జనం నిర్దేశిత కాలపరిమితిలోగా పూర్తిచేయాలి సర్వేకు
ఆటంకం కలిగిస్తే ఉపేక్షించవద్దు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సర్వేకు ఆటంకం కలిగించే వారిని ఎట్టి పరిస్థితి లో ఉపేక్షించవద్దని సిఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చే శారు. సర్వే జరుగుతున్న తీరును ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తూ ఎటువంటి ఆటంకం లేకుండా జరిగే విధంగా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా,ఉద్యోగ, రా జకీయ, కుల సర్వేను దేశానికే ఆదర్శవంతంగా అయ్యే విధంగా నిర్వహించాలని పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం సిఎం క్యాంపు కార్యాలయంలో ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతున్న తీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 44.1 శాతం సర్వే పూర్తయిందని సిఎం వెల్లడించారు. నవంబర్ 6 వతేదీన ప్రారంభమైన ఈ సర్వేను జాప్యం లేకుండా నిర్దేసిత కాలపరమితిలో సకాలంలో పూర్తి చేయడానికి కృషిచేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి దశలో నిర్వహించిన నివాసాల లిస్టింగ్‌లో మొత్తం 1,16, 14,349 ఇళ్లకు మార్కింగ్ చేయడమైనదని, ఈ ఇళ్లల్లో ఏ ఒక్క ఇల్లును
ఇళ్లకు 85 వేల మంది ఎన్యూమరేటర్లతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతోందని అన్నారు. కుటుంబ సర్వే రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బందులు లేవని, ప్రజలే స్వచ్ఛందంగా సమాచారాన్ని ఇస్తున్నారని అన్నారు. అధికారులకు గ్రామాల్లో ఉన్న ప్రజలంతా సహకరిస్తున్నారని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు అనవసర విషయాన్ని ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సర్వే కోసం ఉద్దేశించిన ఫారంలో ప్రజలకు ఎక్కడా ఇబ్బందికర ప్రశ్నలు లేవని అన్నారు. బ్యాంకు అకౌంటు, ఏ ఇతర డాక్యుమెంట్‌లు సర్వే సిబ్బంది అడగడం లేదని, కులం చెప్పొద్దు అనుకుంటే 999 ఆప్షన్ ఉందన్నారు. తాము కొత్త ప్రణాళికతో ప్రజా పాలన ద్వారా ముందుకుపోతున్నామని అందరూ సచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. మంత్రి వెంట పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూజల హరికృష్ణ, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.