- Advertisement -
గతంలో పాల్గొనని 3,56,323
మందికి సదావకాశం 28 తేదీ
వరకు కొనసాగనున్న సర్వే
ప్రత్యేక కాల్ సెంటర్ నెంబరు
040-21111111
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్ర భుత్వం నిర్వహించిన కులగణనలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం ఆదివారం (16వ తేదీ) నుంచి మరో అవకాశాన్ని క ల్పించింది. ఈనెల 28వ తేదీ వరకు కొనసాగుతుంది. గతంలో దాదాపు యాబై రో జుల పాటు జరిగిన కులగణనలో 3,56, 323 మంది పాల్గొనలేదు. దాంతో వారి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు 13 రోజుల పాటు వివిధ అవకాశాలను కల్పిస్తూ ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. అంతే కా కుండా ఒక ప్రత్యేకంగా నెంబరు 040-21111111 కాల్ సెంటర్‌ను ఏర్పాటుచేసింది.నిర్దేశించిన రోజుల్లో ఉదయం 9గం టల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ కాల్‌సెంటర్ పని చేస్తుంది.
- Advertisement -