ఢిల్లీ: బిసిల గొంతుక వినిపించడానికే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. జనాభా తెలియకుంటే రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదని కోర్టులు చెప్పాయని, స్థానిక సంస్థలు, చట్ట సభల్లో రిజర్వేషన్లు కావాలంటే జనాభా తేలాలన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా బిసి సంఘాలు ధర్నా చేపట్టాయి. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బిసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ధర్నాలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మీడియాతో ప్రసంగించారు. రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టికి తీసుకవచ్చామని సిఎం పేర్కొన్నారు. రిజర్వేషన్ల అంశానికి శాశ్వత పరిష్కారం లభించాలని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారని, జనగణనతో పాటు కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని, దామాషా ప్రకారం నిధులు, నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్నారు. అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని రాహుల్‌గాంధీ చెప్పారని రేవంత్ కొనియాడారు.
జనగణనతో పాటు కులగణన చేపట్టాలి: రేవంత్ రెడ్డి
- Advertisement -
- Advertisement -
- Advertisement -