Thursday, December 19, 2024

కులగణన కాంగ్రెస్ గ్యారంటీ: జైరామ్ రమేష్

- Advertisement -
- Advertisement -

నందుర్బార్ (మహారాష్ట్ర): కులగణన చేపట్టడం తమ పార్టీ గ్యారంటీ అని కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ మంగళవారం మహారాష్ట్రలోని నందుర్బార్‌లో చెప్పారు. రాహుల్ గాంధీ సారథ్యంలోని ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ తన చివరి ఘట్టంలో మహారాష్ట్రలోకి ప్రవేశించడానికి ముందు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి రమేష్ విలేకరులతో మాట్లాడుతూ..సామాజిక, ఆర్థిక, కులగణన జరగాలని ఒక గ్యారంటీ ఇచ్చామన్నారు.

‘ఇది మన సమాజం ఎక్స్‌రే. ఇది వివిధ కులాల జనాభాను, మన దేశ సంపదలో వారి వాటాను సూచిస్తుంది. మన ప్రజాస్వామ్య సంస్థలలో వారి వాటాను కూడా ప్రతిబింబిస్తుంది’ అని రమేష్ తెలిపారు. నందుర్బార్ జిల్లా నెహ్రూ, గాంధీ కుటుంబంతో అనుబంధానికి పేరొందినది. యాత్ర ముంబయిలో ముగుస్తుంది. రాహుల్ గాంధీ ఈ నెల 17న ముంబయిలో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News