Monday, February 10, 2025

కులగణన తప్పులతడక

- Advertisement -
- Advertisement -

22 లక్షల మంది ఉన్నా లేనట్లు చూపారు కాంగ్రెస్ జరిపిందంతా అశాస్త్రీయమైన సర్వే..
రీ సర్వే జరపాలి 42 శాతం రిజర్వేషన్‌తో బిల్లు తేలేదు.. సొల్లు మాత్రం చెప్పారు బిసిలకు
సిఎం క్షమాపణ చెప్పాలి మోడీ, రాహుల్ చాయ్ తాగే లోపు రాజ్యాంగ సవరణ జరపొచ్చు
బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలు పార్టీ బిసి నేతలతో భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్: బీసీల జనాభాను ఐదున్నర ప ర్సెంట్ తక్కువగా చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని మోసం చేసిందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. 42శాతం రిజర్వేషన్ల వాగ్దానాన్ని రేవంత్ ప్రభుత్వం తుంగలో తొక్కింది. దీనిపై శాసనసభ, శాసనమండలిలో బీఆర్‌ఎస్ పార్టీ తరపున తమ నిరసనను తెలిపామన్నారు. కులగణన తప్పుల తడక అని, చిత్తుకాగితంతో సమానమని, ఈ సర్వేతో బలహీన వర్గాల గొంతును కాంగ్రెస్ కోసిందని, దీనిని ఏ బీసీ బిడ్డా ఒప్పుకోరన్నారు. మధుసూదనా చారి, తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ పార్టీ అసెంబ్లీలో తన వాదనను వినిపించిందని, శాస్త్రీయంగా మళ్లీ రీసర్వే చేయాలని, బలహీన వర్గాల బిడ్డలు ఆందోళనలతో ఉన్నారన్నారు.

ప్రభుత్వ సం క్షేమ పథకాల్లో, రేషన్ కార్డులలో, ఇండ్ల కేటాయింపుల్లో, ఆరు గ్యారంటీల్లో తమ వాటా తగ్గుతుందేమోనని అట్టడుగు స్థాయి లో ఉన్న ఎంబీసీలు, బీసీ బిడ్డలు భయపడుతున్నారన్నారు. ఉ ల్టా చోర్ కొత్వాల్ డాంటే అన్నట్టుగా రేవంత్ ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తుందన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పు డు చేసిన సమగ్ర సర్వేను అందులోని బీసీ జనాభాను తప్పుపడుతూ ప్రభుత్వం పెద్దలు మాట్లాడుతున్నారని, బిసి డిక్లరేషన్ పేరిట కామారెడ్డి సభలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వాగ్దానాలు చేసిందని, 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పిందన్నారు. బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ పెడతామని బీసీ సబ్ ప్లాన్ తీసుకువస్తామని సిద్ధరామయ్య నోటి వెంట కాంగ్రెస్ పార్టీ చెప్పించిందని, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ప్రోక్యుర్మెంట్లలో 42శాతం బీసీలకే ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ సంవత్సరం గడిచిన 15 పైసలు కూడా బీసీ డీక్లరేషన్ కోసం ప్రభుత్వం కేటాయించలేదన్నారు. కొత్తగా బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఒక్కో కార్పొరేషన్ 50 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి 50 పైసలు కూడా ఇవ్వలేదన్నారు.

బీసీలను క్షమాపణ అడగాలి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలను క్షమాపణ అడగాలని, ఐదున్నర శాతం జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మందిని లేనట్టుగా చిత్రీకరించిన దుర్మార్గాన్ని రేవంత్ రెడ్డి చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణన అశాస్త్రీయం అసంబద్ధమని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నే కులగణన సర్వేను చిత్తుకాగితంతో సమానమని కాలబెట్టారన్నారు. మళ్లీ రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఈసారి కులగణలో తామంతా పాల్గొంటామని, కోరిన వివరణ వివరాలు ఇస్తామని, రీసర్వే కు వెంటనే ఆదేశించాలన్నారు.

42శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న మాటను రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని, దీనిపై మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు తీసుకువస్తారని భావించామని, కానీ బిల్లు తేలేదని, సొల్లు మాత్రం చెప్పారన్నారు. బీఆర్‌ఎస్ మాత్రమే 50 శాతానికి పైగానే బీసీలకు పార్టీ పరంగా అసెంబ్లీ పార్లమెంటు స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇచ్చిందని, అత్యధిక సీట్లు కేటాయించిందన్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చిందని, శాసనసభ ఎన్నికల్లో 34 సీట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News