Wednesday, January 22, 2025

బలహీనవర్గాల కోసమే కులగణన: రేవంత్

- Advertisement -
- Advertisement -

బలహీనవర్గాలను బలోపేతం చేసేందుకే కులగణన చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఏ సామాజిక  వర్గానికి చెందినవారు ఎంతమంది ఉన్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఆయా సామాజిక వర్గాలలో ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయనే పూర్తి వివరాలతో ఈ సర్వే నిర్వహిస్తామన్నారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ కులగణన జరిగితే బలహీనవర్గాలకు మరింత ప్రయోజనకరంగా సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అన్నారు.

కేసీఆర్ పదేళ్ల క్రితం జరిపిన సామాజిక కుటుంబ సర్వే వివరాలను ఇప్పటికీ బయటపెట్టలేదనీ, పదేళ్లుగా దాచుకున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. కులగణనపై తీర్మానం చేస్తున్న సమయంలోనూ కేసీఆర్ సభకు రాకపోవడం విచారకరమన్నారు. కులగణనపై ప్రజలలో అనుమానాలు లేవనెత్తేలా విపక్షాల వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కులగణన తీర్మానంపై అనుమానం ఉంటే ప్రతిపక్షాలు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News