Tuesday, April 15, 2025

బిసిలకు 51 శాతం కోటా

- Advertisement -
- Advertisement -

కర్నాటకలో వెనుకబడిన తరగతులకు (బిసిలకు) రిజర్వేషన్‌ను ప్రస్తుత 32 శాతం నుంచి 51 శాతానికి హెచ్చించాలని రాష్ట్ర మంత్రివర్గానికి సమర్పించిన కుల గణన నివేదిక సిఫార్సు చేసింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, సంక్షిప్తంగా కుల గణన అని పేర్కొంటున్న సాంఘిక ఆర్థిక, విద్యా సర్వే బిసి జనాభా 70 శాతం ఉందని కూడా వెల్లడించింది. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో బిసిలకు 51 శాతం రిజర్వేషన్ కల్పించాలని కూడా నివేదిక సూచించింది. బిసిల జనాభా ప్రకారం వరుసగా 69 శాతం, 77 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న తమిళనాడు, ఝార్ఖండ్‌లను నివేదిక ఈ సందర్భంగా ఉదహరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బిసిల జనాభా 1ఎ కేటగరీలో 3496638గాను. 1బి కేటగరీలో 7392313గాను,

2ఎ కేటగరీలో 7778209గాను, 2బి కేటగరీలో 7525880గాను, 3ఎ కేటగరీలో 7299577గాను, 3బి కేటగరీలో 15437113గాను ఉన్నట్లు సర్వే నివేదిక తెలియజేసింది. ఈ విధంగా ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసిల) మొత్తం జనాభా 41630153. ప్రభుత్వ వర్గాలు నివేదికను ఉటంకిస్తూ, ఎస్‌సిలు, ఎస్‌టిల జనాభా వరుసగా 10929347, 42841289గా ఉన్నట్లు తెలిపాయి. నమూనా సర్వే ప్రకారం జనాభా59814942. 2015లో హెచ్ కాంతారాజ్ ప్రారంభించిన సర్వేను ఆ తరువాత కర్నాటక రాష్ట్ర బిసిల కమిషన్ చైర్మన్ కె జయప్రకాశ్ హెగ్డే పూర్తి చేశారు. నివేదికను నిరుడు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News