Thursday, February 20, 2025

కులగణన సర్వేలో పాల్గొనండి: మంత్రి పొన్నం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కులగణన వివరాల నమోదుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం ప్రజలకు ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సోమవారం ఆయన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. కుల సర్వే లో పాల్గొనని వారు సమాచారం ఇవ్వని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. తెలంగాణ జనాభా లెక్కల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పినట్టు ఎవరెంతో వారికంత న్యాయం జరగాలన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 42 శాతం రిజర్వేషన్లకు రాజకీయ విద్య ఉద్యోగ అవకాశాల్లో చట్ట బద్దత చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం స్పష్టం చేశారు.

కులగణనలో పాల్గొనని వారు ఈనెల 28 వరకు నమోదు చేసుకోవచ్చని, దీని కోసం టోల్ ఫ్రీ నం. 040-211 11111ను ఏర్పాటు చేయడం జరిగిందని, తాము కుల సర్వేలో పాల్గొనలేదని ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి ఎన్యుమరేటర్లు వెళ్లి వివరాలు నమోదు చేయాలన్నారు. ఎంపిడిఒ కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని పొన్నం సూచించారు.

ఆన్లైన్ లో నమోదు చేసుకునే వారు కులగణన కోసం ఇక్కడ క్లిక్ చేయాలని సూచించారు, కులగణన సర్వేలో 3,56,323 కుటుంబాలు పాల్గొనలేదన్నారు. సర్వేలో పాల్గొని  అందుతున్న పథకాలు అర్హులుగా ఉండాలన్నారు. ఎక్కడెక్కడ కుల సర్వేలో పాల్గొనలేదో అక్కడ కుల సంఘాల నేతలు, మేధావులు ఫ్రొఫెసర్లు వారికి అవగాహన కల్పించాలని, వారిని భాగస్వామ్యం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News