- Advertisement -
ముంబై : నకిలీ కుల ధ్రువీకరణ పత్రం సమర్పించారన్న కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు ఊరట లభించింది. ఆయనకు క్యాస్ట్ స్క్రూటినీ కమిటీ క్లీన్‌చిట్ ఇచ్చింది. నకిలీ సర్టిఫికెట్‌తో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. దీనిపై విచారణ జరిపిన ప్యానల్ ఆయన పుట్టుకతో ముస్లిం కాదని, హిందూ దళిత కమ్యూనిటీకి చెందిన మహర్ వర్గానికి చెందిన వారని వివరించింది.న ఈమేరకు మహారాష్ట్ర ప్రభుత్వ సామాజిక న్యాయశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసినట్టు అధికారి ఒకరు తెలిపారు.
- Advertisement -