Thursday, December 26, 2024

సిఎం కెసిఆర్ నాయకత్వంలో కుల వృత్తులు బల పడ్డాయి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని వర్గాల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, కుల సంఘాలు బలపడ్డాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా తెలంగాణ గ్రామాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని విధాల అభివృద్ది చెంది, దేశానికి ఆదర్శంగా మారాయి అన్నారు.

Caste professions were strengthened under leadership of CM KCR

పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలం, మైలారం గ్రామానికి చెందిన పలు కుల సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు కమ్యూనిటీ హాళ్లు కావాలంటూ నేడు హనుమకొండ, ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. మంత్రి గారు సానుకూలంగా స్పందించి కమ్యూనిటీ హాళ్లు కట్టిస్తానని సంఘాలకు హామీ ఇచ్చారు. దీంతో సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ..మంత్రిగారికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఐకేపీ మహిళా సంఘం, దళిత సంఘం, యాదవ సంఘం, గౌడ సంఘం, పద్మశాలి సంఘం, రజక సంఘం సభ్యులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News