Monday, December 23, 2024

ఆత్మగౌరవ భవన నిర్మాణాలు

- Advertisement -
- Advertisement -

వెనుకబడిన కులాల ఇబ్బందులను గుర్తించి వెనుకబడిన కులాలకు హైదరాబాద్ నగరంలో స్వంత భవనాలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కోకాపేట్, ఉప్పల్ ప్రాంతాలలో జనాభా లెక్కల ప్రాతిపదికన ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు భూమిని కేటాయించారు. భూమిని కేటాయించినప్పటికీ భవన నిర్మాణానికి కావలసిన నిధులు లేకపోవడం వల్ల వృథా గా ఉండే అవకాశం ఉందని భావించి భవన నిర్మాణానికి ఆర్థికంగా ఎకరానికి కోటి రూపాయలు ఆర్థికంగా సహాయం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్., తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన (బిసి) కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి స్థలమును కేటాయించడం, ఆర్థికంగా ఆదుకోవడం చరిత్రాత్మక నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలోని వెనుకబడిన కులాల విద్యార్థులు, విద్య, వ్యాపార, వాణిజ్య, ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రుల పనుల కోసం రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌కు వస్తే కుల సంఘాలకు భవనాలు లేక అధిక మొత్తంలో చెల్లించి ప్రైవేటు లాడ్జ్‌ల్లో ఉండేవారు. వెనుకబడిన కులాల ఇబ్బందులను గుర్తించి వెనుకబడిన కులాలకు హైదరాబాద్ నగరంలో స్వంత భవనాలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కోకాపేట్, ఉప్పల్ ప్రాంతాలలో జనాభా లెక్కల ప్రాతిపదికన ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు భూమిని కేటాయించారు.

భూమిని కేటాయించినప్పటికీ భవన నిర్మాణానికి కావలసిన రూపాయలు ఆర్థికంగా లేకపోవడం వల్ల వృథా గా ఉండే అవకాశం ఉందని భావించి భవన నిర్మాణానికి ఆర్థికంగా ఎకరానికి కోటి రూపాయలు ఆర్థికంగా సహాయం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్., తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటి దఫా 24 వెనుకబడిన (బిసి) కులాలకు కోకాపేట్, ఉప్పల్ ప్రాంతాలలో భవన నిర్మాణానికి స్థలమును, భవనం ప్రారంభించుకోవడానికి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. వెనుకబడిన కులాలలో అనేక కుల సంఘాలు భవన నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసి భవన నిర్మాణాలు చేసుకుంటున్నారు.

వెనుకబడిన ( బిసి) కులాలలో అనేక గ్రూపులు ఉండడం, అనేక మంది తాము అధ్యక్షులమంటే తామే అధ్యక్షులమంటూ గొడవ పడటంతో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రికి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శికి ఏమి అర్ధంకాక గొడవ పడే వెనుకబడిన (బిసి) కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాలను, ఆర్థిక సహాయాన్ని నిలిపివేశారు. తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, వెనుకబడిన (బిసి) సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వేంకటేశం వెనుకబడిన కులాల ప్రతినిధులతో హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో గల మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసి వెనుకబడిన ( బిసి ) కులాలవారు ఐక్యమత్యంతో ఉండాలని, అన్ని గ్రూపులకు చెందిన అధ్యక్షులు ఏక సంఘంగా ఏర్పడి ట్రస్ట్ ఏర్పాటు చేసుకోని రిజిస్టర్డ్ చేసుకోవాలని సూచించడం జరిగింది.

తెలంగాణ రాష్ట్రంలోని అనేక వెనుకబడిన (బిసి) కులాల అధ్యక్షులు ఏక సంఘంగా ఏర్పడి ట్రస్ట్‌లను ఏర్పాటు చేసుకొని రిజిస్టర్డ్ చేసుకోవడం జరిగింది. అలా ట్రస్ట్‌గా ఏర్పడి రిజిస్టర్డ్ చేసుకున్న సంఘాలలో ముఖ్యంగా ఆరె కటిక కులం ఒకటి. ఆరె కటిక కులంలో 14, 15 సంఘాలు ఏర్పాటు చేసుకొని నేను అధ్యక్షుడిని అంటే కాదు కూడదు నేనే అధ్యక్షుడిని అంటూ ఎవరికి వారు గ్రూపుల వారీగా సమావేశాలు పెట్టుకోవడం జరిగేది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక వ్యక్తిగతమైన ఆరోపణలు చేసుకుంటూ కాలం గడిపేవారు.

తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిన కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు స్థలములను కేటాయించడం, ఆర్థికంగా సహాయం అందిస్తామని చెప్పడంతో ఆత్మగౌరవ భవన నిర్మాణానికి స్థలమును, ఆర్థిక సహాయాన్ని ఏ విధంగానైనా తీసుకోవాలనే పట్టుదలతో ఆరె కటిక కులంలోని వేరు వేరు గ్రూపులకు చెందిన అధ్యక్షులు ఏక సంఘంగా ఏర్పడి ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా వేరు వేరు గ్రూపులకు చెందిన వెనుకబడిన (బిసి) కులాలకు చెందిన అనేక కులాలు ఏక సంఘంగా ఏర్పడి ట్రస్ట్‌లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వెనుకబడిన (బిసి) కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఏక సంఘంగా ఏర్పడి ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్న కులాల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన (బిసి) శాఖ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు, బిసి సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వేంకటేశంకు కలిసి ఏక సంఘంగా ఏర్పడిన విషయాన్ని ట్రస్ట్‌గా ఏర్పడి రిజిస్టర్డ్ చేసుకున్న విషయాన్ని తెలపడం జరిగింది. కొన్ని కులాలలో ఎంతకు ఐక్యత రాకపోవడంతో ప్రభుత్వమే ఆలోచించి, నిర్ణయం తీసుకొని వెనుకబడిన (బిసి) కులాలలో చురుకైన కార్యక్రమాలు, కులాభివృద్దికి కృషి చేసే సంఘాలను గుర్తించి ఆత్మగౌరవ భవన పట్టాలను 08 సెప్టెంబర్ 2022 నాడు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో గల చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెనుకబడిన (బిసి) సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, క్రీడలు, ఎక్సైజ్ సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి జి.నిరంజన్, ఎమ్మెల్సీలు ప్రకాష్, బసవరాజు సారయ్య తదితరులు ప్రసంగిస్తూ ఆత్మగౌరవ భవనాలు ఏ ఒక్క వ్యక్తికో, ఏ ఒక్క సంఘానికో, ఏ ఒక్క గ్రూపుకో సంబంధించిన వ్యవహారం కాదని కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ ఆత్మగౌరవ భవనంలో అధికారం ఉంటుందని తెలిపారు. కోట్ల రూపాయల విలువైన భూములను వెనుకబడిన ఆత్మగౌరవ భవన నిర్మాణాలకు కేటాయించడం అభినందించదగిన విషయంగా అభివర్ణించారు. సంవత్సరం లోపల ఆత్మగౌరవ భవన నిర్మాణాలు పూర్తి చేసుకొని ఆత్మగౌరవంతో ఉందామని అన్నారు. ఆత్మగౌరవ భవనాలలో విద్యార్థులకు ఉపయోగపడే హాస్టళ్ల నిర్మాణం, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కుల సభ్యులకు ఉపయోగపడే విధంగా ఉండాలని అన్నారు. ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన కులాల ఆత్మగౌరవ భవన నిర్మాణాలు చేయడం వెనుకబడిన కులాల అభివృద్ధి సాధించడానికి అవసరమైన తోడ్పాటు అందిస్తుందని చెప్పారు. ఆత్మగౌరవ భవనాలు తీసుకున్న 11 కులాలలో ఆరె కటికలు, ముదిరాజ్, వాల్మీకి బోయ, నాయీబ్రహ్మణ, పద్మశాలి, రజక, గాండ్ల, బొందిలి, భూంజ్యా, కంచి, సంచార జాతులు ఉన్నాయి. ఆత్మగౌరవ భవనాల పట్టాలు తీసుకున్న వెనుకబడిన ( బిసి) కులాల ప్రతినిధులు వీలైనంత త్వరగా ఆత్మగౌరవ భవన నిర్మాణాలు పూర్తి చేసుకొంటామని ఆనందంగా తెలిపారు.

ఎస్ విజయ భాస్కర్
9290826988

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News