Wednesday, January 15, 2025

కాస్టింగ్ కౌచ్ అనే పదం వింటేనే బాధేస్తుంది: కృతిశెట్టి

- Advertisement -
- Advertisement -

కాస్టింగ్ కౌచ్ వ్యవహారాలు తనను ఇబ్బంది పెడుతున్నాయని అంటోంది ముద్దుగుమ్మ కృతి శెట్టి. తనకు వ్యక్తిగతంగా అలాంటి చేదు అనుభవాలు లేవని, ఇలాంటి ఘటనల గురించి విన్నప్పుడు మానసికంగా చాలా బాధగా అనిపిస్తోందని అంటోంది. “మీటూ అనుభవాలు ఒక్కొక్కరు చెబుతుంటే చాలా బాధగా ఉంది. నేను చాలా సెన్సిటివ్. ఇలాంటివి విన్నప్పుడు వ్యక్తిగతంగా చాలా బాధేస్తోంది.

చాలామంది కాస్టింగ్ కౌచ్ బారిన పడిన ఘటనలు వింటున్నాను. దీనిపై ఉద్యమం మొదలైంది. ఫిలిం ఇండస్ట్రీలో పాజిటివ్ మార్పు వస్తుందని ఆశిస్తున్నాను”అని అన్నారు. తమ మలయాళ సినిమా ప్రమోషన్ లో భాగంగా నేషనల్ మీడియాతో మాట్లాడిన కృతి శెట్టి.. ప్రజలకు దీనిపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోందని అభిప్రాయపడింది. ఒకప్పుడు హీరోయిన్లను చాలా తప్పుడు కోణంలో చూసేవారని, ఇప్పుడు వాళ్లు కూడా మహిళా ఆర్టిస్టుల బాధను అర్థం చేసుకుంటున్నారని అంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News