Friday, December 20, 2024

క్యాస్ట్రోల్, మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ ఒప్పందం

- Advertisement -
- Advertisement -

దేశంలోని ప్రముఖ లూబ్రికెంట్ సంస్థ అయిన క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్, ప్రముఖ బీమా బ్రోకరేజీ సంస్థ అయిన మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్ (MIBL)తో ఒప్పందం కుదుర్చుకుంది. కాస్ట్రోల్ ఆటో సర్వీస్ (CAS) వర్క్‌ షాప్‌ లు ఇప్పుడు ఎంఐబీఎల్ ద్వారా భారత దేశంలోని ప్రముఖ మోటార్ బీమా ప్రొవైడర్ల నుండి అర్హత కలిగిన బీమా పాలసీల పంపిణీ కోసం తమను తాము పిఒఎస్ పి (పాయింట్ ఆఫ్ సేల్ పర్సన్స్) గా ఎంప్యానెల్ చేసుకునే అవకాశాన్ని కలిగి ఉన్నాయి. సీఏఎస్ వర్క్‌ షాప్‌లు తమ వినియోగదారుల వాహనాలకు మరమ్మతులు, నిర్వహణ సేవలతో పాటు డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వాహన బీమా ఉత్పత్తులను అందించగలవు.

క్యాస్ట్రోల్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సందీప్ సాంగ్వాన్ మాట్లాడుతూ.. “ఆటోమొబైల్ పరిశ్రమ గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నది. భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఉన్నందున, వా హన బీమా అపూర్వమైన వృద్ధిని సాధించింది. మరింత మంది కస్టమర్‌లను చేరుకోవడానికి మా సీఏఎస్ వ ర్క్‌ షాప్‌లను మరింత శక్తివంతం చేయడానికి మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్‌తో ఈ ఒప్పందం మాకు విశ్వాసాన్ని ఇస్తుంది. ఇది మా సేవ, నిర్వహణ వ్యూహంలో ఒక ముఖ్యమైన మైలు రాయిని సూచిస్తుంది, ఎందుకంటే ఇది నిస్సందేహంగా మా నెట్‌వర్క్ వర్క్‌ షాప్‌ల సామర్థ్యాలను పెంచుతుంది, వారు తమ కస్ట మర్‌లకు అసాధారణమైన లేదా పెంచే విలువను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉండేందుకు వీలు కల్పిస్తుంది’’ అని అన్నారు.

“భారతదేశంలో (మార్కెట్ అధ్యయనాల ప్రకారం) నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్‌లలో వాహన బీమా అధి కంగా 34% వాటాను కలిగి ఉంది. వృద్ధి మార్కెట్‌లో అవకాశాలను అందిస్తుంది. క్యాస్ట్రోల్ ఇండియాతో ఈ సహ కారం, మా పరిధిని పెంచుకోడానికి ఈ వర్క్‌ షాప్‌లకు సహాయం చేస్తుంది. మా ప్యానెల్‌లోని ప్రముఖ బీమా కంపెనీలతో పీఓఎస్పీలుగా మారడం, తద్వారా నగదు రహిత సేవలను అందించడానికి, ప్రమాద మరమ్మతు ల ద్వారా పెరుగుతున్న వ్యాపారాన్ని సృష్టించేందుకు వారికి అవకాశం కల్పిస్తున్నాం. సీఏఎస్ వర్క్‌ షాప్‌ లను ఆటోమోటివ్ పరిశ్రమలో విశ్వసనీయ సేవా ప్రదాతలుగా క్యాస్ట్రోల్‌తో కలిసి స్థాపించడానికి మేం కట్టుబడి ఉన్నాం” అని మహీంద్రా ఇన్సూరెన్స్ బ్రోకర్స్ లిమిటెడ్, మేనేజింగ్ డైరెక్టర్, ప్రిన్సిపల్ ఆఫీసర్ వేదనారాయణన్ శే షాద్రి అన్నారు.

ఈ ఒప్పందం సీఎఎస్ వర్క్‌ షాప్‌లకు వారి కస్టమర్ బేస్‌ను విస్తరించడానికి, విలువ జోడించిన సేవలను అం దించడానికి అవకాశాన్ని అందిస్తుంది. ఫలితంగా కస్టమర్ సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. మొత్తంమీద, ఈ అనుబంధం ఆటోమోటివ్ పరిశ్రమలో విశ్వసనీయ సేవా ప్రదాతలుగా తమను తాము స్థిరపరచుకోవడంలో సీఎఎస్ వర్క్‌ షాప్‌లకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News