Monday, December 23, 2024

పోలింగ్ సిబ్బందికి నేడు సాధారణ సెలవు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధులు నిర్వహించిన ప్రభుత్వోద్యోగులకు డిసెంబర్ 1న ప్రభుత్వం క్యాజువల్ లీవ్ ప్రకటించింది. ఎన్నికల సందర్భంగా నవంబర్ 29, 30 తేదీల్లో రెండు రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో విధులు నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, కాలేజి ఎడ్యుకేషన్, టెక్నికల్ ఎడ్యుకేషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిసెంబర్ ఒకటో తేదీన స్పెషల్ క్యాజువల్ లీవ్ గా పరిగణిస్తూ జిల్లాల వారిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News