Friday, November 22, 2024

ఎబి వెంకటేశ్వరరావుకు ఊరట..సస్పెన్షన్ ను కొట్టివేసిన క్యాట్

- Advertisement -
- Advertisement -

ఎబి వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, సర్వీస్ పరంగా ఆయనకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని క్యాట్ స్పష్టం చేసింది. ఈ సస్పెన్షన్ చట్ట విరుద్ధమని, ఈ విషయం లో సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా మరోసారి సస్పెండ్ చేయడం ఒక ఉద్యోగిని వేధించడం కిందికే వస్తుందని క్యాట్ అభిప్రాయ పడింది. గత టిడిపి ప్రభుత్వ హయాంలో నిఘా విభాగం అధిపతిగా పనిచేసిన కాలంలో ఎబి వెంకటేశ్వరరావు అవినీతికి పాల్పడ్డారని వైసిపి సర్కారు ఆరోపించి, సస్పెండ్ చేసింది. ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారన్నది ఆయనపై ఆరోపణ.

అయితే ఆయన సుప్రీంకోర్టు వర కు వెళ్లి న్యాయ పోరాటం చేసి గెలిచారు. దాంతో ప్రభుత్వం ఆయనను ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్ గా నియమించింది. ఈ నియామకం 2022లో జరగ్గా, కేవలం రెండు వారాల వ్యవధిలోనే ప్రభుత్వం ఆయనను మళ్లీ సస్పెండ్ చేసింది. తనను రెండోసారి సస్పెండ్ చేసిన నేపథ్యంలో ఎబి వెంకటేశ్వరరావు మరోసారి న్యాయ పోరాటం ప్రారంభించారు. క్యాట్‌ను ఆశ్రయించడంతో ఇటీవల వాదనలు ముగియగా, తీర్పు ను క్యాట్ రిజర్వ్‌లో ఉంచింది. బుధవారం ఎబి వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News