Sunday, December 22, 2024

జెఎన్టియుహెచ్ క్యాంపస్ మెస్‌ చట్నీలో పరుగులు పెడుతున్న ఎలుక… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా సుల్తాన్ పూర్ ప్రాంతం జెఎన్ టియు కాలేజీలోని క్యాంటీన్‌లో చట్నీ పాత్రలో ఎలుక కనిపించింది. మూత పెట్టకపోవడంతో చట్నీలో ఎలుక పడింది. చట్నీలో ఎలుక పరుగులు తీయడం చూసిన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్నీలో ఎలుక పడిన ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ నరసింహ స్పందించారు. తినేందుకు తయారు చేసిన చట్నీలో ఎలుక పడలేదని, శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక పడిందని వివరణ ఇచ్చారు. పాత్రలో ఉన్న ఎలుకను తీసి వైరల్ చేశారన్నారు. కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేశారని మండిపడ్డారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News