Wednesday, January 22, 2025

రూ. 60 వేల తన పిల్లిని చోరీ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అత్యంత అరుదైన జాతికి చెందిన తన పిల్లి ని ఎవరో చోరీ చేశారంటూ హైదరాబాద్ వాసి ఒకరు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 18 నెలల వయసున్న తన పిల్లి అత్యంత అఉదైన ఖో మనీ జాతికి చెందినదని, దాన్ని రూ. 50,000 పెట్టి తాను కొన్నానని ఆ పిల్లి యజమాని షేక్ హుస్సేన్ మహమూద్ పోలీసులకు తెలిపాడు. వనస్థలిపురంలోని జహంగీర్‌నగర్‌కు చెందిన మహమూద్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం..ఆదివారం ఉదయం 8.45 గంటలకు ఒక వ్యక్తి యాక్టివా స్కూటర్‌లో తన ఇంటికి వచ్చాడని, పిల్లి ఇంట్లో నుంచి బయటకు వచ్చినపుడు దాన్ని దొంగిలించి తన స్కూటర్‌లో ఆ వ్యక్తి పరారు కావడం సిసిటివి ఫుటేజ్‌లో రికార్డయింది. పోలీసలు కేసు నమోదు చేసి స్కూటర్ ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News