Friday, December 20, 2024

క్యాట్ నోటిఫికేషన్ విడుదల.. 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ

- Advertisement -
- Advertisement -

నవంబర్ 26న పరీక్ష

హైదరాబాద్ :దేశవ్యాప్తంగా ప్రఖ్యాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం)లలో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్-(క్యాట్) 2023 నోటిఫికేషన్‌ను ఐఐఎం లక్నో విడుదల చేసింది. ఆగస్టు 2వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు స్వీకరించనున్నారు. అక్టోబర్ 25 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నవంబర్ 26న దేశవ్యాప్తంగా క్యాట్ పరీక్ష జరగనుంది. జనవరిలో ఫలితాలు విడుదలవుతాయి. ఈ పరీక్షకు ఎస్‌సి, ఎస్‌టి, పిడబ్లూడి అభ్యర్థులు రూ.1200, మిగతా వారు రూ. 2400 ఫీజు చెల్లించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News