Saturday, November 23, 2024

పాక్‌లోకి ప్రవేశించిన పశువుల కాపరికి 13 ఏళ్ల తర్వాత విముక్తి..

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్: పొరపాటున పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన గుజరాత్ పశువుల కాపరిని పాకిస్థాన్ 13 ఏళ్ల తర్వాత విడుదల చేసింది. ఇస్మాయిల్ సమా(60) అనే వ్యక్తి 2008లో తన పశువులను మేపుకుంటూ సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోకి ప్రవేశించారు. కచ్ జిల్లాలోని సమా గ్రామం నానా దినారా పాక్ సరిహద్దుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సమాను భారత నిఘా సంస్థ ‘రా’కు చెందిన వ్యక్తిగా పాక్ అధికారులు అనుమానించారు. భారత రాయబార కార్యాలయం జోక్యంతో ఇస్లామాబాద్ హైకోర్టు సమా విడుదలకు ఆదేశించింది. శుక్రవారమే వాఘాఅట్టారీ సరిహద్దు వద్ద పాక్ అధికారులు భారత్‌కు అప్పగించారు. అట్టారీ వద్ద భారత అధికారులు సమాకు అవసరమైన వైద్య పరీక్షలు జరిపించి, ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. పొరపాటున సరిహద్దు దాటి వెళ్లానని సమా తెలిపారు. 2017 వరకూ సమా ఎక్కడ ఉన్నదీ ఆయన కుటుంబసభ్యులకు తెలియదు.

Missing Cattle herder released who entered Pakistan in 2008

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News