Tuesday, September 17, 2024

గోదావరి వరద నీటిలో చిక్కుకున్న పశువుల కాపరులు కాపరులు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్సారెస్పీ 40 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో మెండోరా మండలం సావెల్ గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. సావెల్ గ్రామ శివారులో సాంబయ్య ఆశ్రమంలో నారాయణ, సంతోష్, ముత్తెన్న అనే వ్యక్తులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ఈరోజు ఎడ్ల పొలాల అమావాస్య కావడంతోఆశ్రమంలో ఉన్న 24 ఆవులకు పూజలు చేసేందుకు వెళ్లి చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. గోదావరిలో వరద ఎక్కువగా ఉండడంతో ఆశ్రమంలో ఇరుక్కుపోయారు.

గోదావరి ఒడ్డున వచ్చి తమను రక్షించండి అని కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వారిని రక్షించేందుకు అధికారులకు సమాచారం అందించారు. కాగా వరదలో చిక్కుకుపోయిన ఈ ముగ్గురు, పశువుల కాపరులని స్థానికులు అంటున్నారు. వరద నీటి వద్ద తమను కాపాడమని అర్ధనాదాలు చేస్తున్న వీరిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రెస్క్యూ ఆపరేషన్ చేసేందుకు రంగంలోకి దిగాయి. సంఘటన స్థలానికి ఆర్మూర్ ఏసిపి బసవ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్ లతోపాటు పోలీసు సహాయక బృందం ,రెస్క్యూ టీం వరదనీటిలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News