Wednesday, January 22, 2025

ప్రాణం తీసిన పశువులు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మృత్యు రూపంలో ఆవులు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తగూడెం గ్రామానికి చెందిన రాం రామకృష్ణ (36) ఎలక్ట్రిషన్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఎలక్ట్రీషన్ సామాన్లు తెచ్చుకోవడానికి ద్విచక్ర వాహనంపై ఖమ్మం నగరం వెళ్లి తిరిగి వస్తున్నాడు.

సరిగ్గా ముత్తగూడెం రోడ్డు లోని ఓ వెంచర్ వద్దకు రాగానే రెండు (పశువులు) ఆవులు పొడుచుకుంటున్నాయి. వాటిని చూసిన రామకృష్ణ 20 మీటర్ల దూరంలో వాహనాన్ని నిలిపివేశాడు. పోట్లాడుకుంటూ అందులోంచి ఓ ఆవు వేగంగా రామకృష్ణ వైపుకు దూసుకు వచ్చింది. ఈ క్రమంలో దవడ కింది బాగం పై పొడవడంతో తలలోకి కొమ్ము దిగి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకొని భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకొని విగత జీవిగా పడి ఉన్న మృతుడుని చూసి చేసిన రోదనలు మిన్నంటాయి.

వారు రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. జరిగిన ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై వెంకటకృష్ణ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News