Wednesday, January 22, 2025

పశువుల కాపరి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

పశువులను మేపేందుకు వెళ్లిన కాపరి అదృశ్యమైనట్లు గా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.మండల పరిధిలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ పశువులను తీసుకుని మేపేందుకు వెళ్లాడు.ఈ క్రమంలో పశువులు తిరిగి ఇంటికి చేరుకున్నాయి. కానీ వాటిని తీసుకు వెళ్లిన అతను తిరగి గ్రామానికి రాకపోవడంతో గ్రామ సమీపంలోని బురదొడ్డి వాగులో పడి కొట్టుకు పోయాడని గ్రామస్తులు ఆందళోనతో వాగులో వెతుకుతున్నారు. సమాచారం తెలుసుకున్న బోడు పోలీసులు గ్రామస్తుల సహాకారంతో వాగులో సుధాకర్ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News