Wednesday, January 22, 2025

పాత విధానమా.. కొత్తదా!

- Advertisement -
- Advertisement -

ఏ ఆదాయపు పన్ను విధానం ఉత్తమమైంది?

న్యూఢిల్లీ : కొత్త ఆర్థిక సంవత్సరం(2023-24) ప్రారంభమైన నేపథ్యం పన్ను చెల్లింపుదారులు కొంత గందరగోళానికి గురవుతున్నారు. యజమానులు తమ ఉద్యోగుల నుండి కొత్త ఆదాయపు పన్ను విధానాన్ని అవలంబిస్తారా? లేదా పాత పన్ను విధానాన్ని అవలంబిస్తారా? అనే సమాచారాన్ని కోరుతున్నారు. ఈ పరిస్థితిలో సిబిడిటి 2023-24లో టిడిఎస్ తగ్గింపు విధానాలకు సంబంధించి ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. దీనిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుండి కొత్త ఆదాయపు పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా మారిందని వెల్లడించింది. దీంతో కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటారా? లేదా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటారా? అని తన ఉద్యోగులను తప్పనిసరిగా అడగాలని సిబిడిటి యజమానులకి చెప్పింది.

ఉద్యోగులందరూ కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారా లేదా పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారా అనేది ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో తమ యజమానికి తెలియజేయాల్సి ఉంటుంది. రెండు ఎంపికల్లో ఏదో ఒకటి చెప్పాల్సి ఉంటుందని సిబిడిటి తన సర్క్యులర్‌లో పేర్కొంది. ఎందుకంటే దాని ఆధారంగా యజమాని ఉద్యోగి ఆదాయంపై టిడిఎస్ తీసివేస్తారు. ఒక ఉద్యోగి తన యజమానికి ఈ విషయాన్ని తెలియజేయకపోతే, ఆ ఉద్యోగిపై డిఫాల్ట్ పన్ను విధానం చెల్లుబాటు అవుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ స్పష్టం చేసింది.

ఎంపిక ఆధారంగా టాక్స్‌పేయర్‌కు ఆదాయం నుండి టిడిఎస్ తీసివేస్తారు. అటువంటి సందర్భాలలో కొత్త ఆదాయ విధానం పన్ను రేటు ప్రకారం, ఉద్యోగి ఆదాయంపై సెక్షన్ 192 కింద యజమాని టిడిఎస్‌ని తీసివేయవలసి ఉంటుంది. 2023-24 సాధారణ బడ్జెట్‌ను సమర్పిస్తూ, కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ పన్ను విధానంగా పరిగణిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కొత్త ఆదాయపు పన్ను విధానంలో పన్ను రేటు పాత పన్ను విధానం కంటే తక్కువగా ఉంది. కానీ కొత్త పన్ను విధానంలో గృహ రుణ వడ్డీ, పెట్టుబడులపై ఎలాంటి మినహాయింపు అందుబాటులో లేదు.

పాత ఆదాయపు పన్ను విధానంలో పెట్టుబడి, గృహ రుణ వడ్డీపై మినహాయింపు తీసుకోవడం ద్వారా మెడిక్లెయిమ్‌పై పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే, వేతనాలు పొందే పన్ను చెల్లింపుదారులు ఐటి రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు కొత్త లేదా పాత పన్ను విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే వ్యాపారం లేదా వృత్తి నుండి ఆదాయాన్ని పొందేవారు ఒకసారి మాత్రమే పన్ను విధానం ఎంపికను ఒక పన్ను విధానం నుండి మరొకదానికి మార్చుకునే అవకాశం ఉంటుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News