Saturday, November 23, 2024

రూ.70,120 కోట్ల రిఫండ్: 26లక్షల మందికి సెటిల్మెంట్..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈ ఏడాది(2021) ఏప్రిల్ 1నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సుమారు 26.09లక్షల మంది పన్ను చెల్లింపు దారులకు రూ.70,120 కోట్లు ఐటి రిఫండ్ చేసినట్టు సిబిడిటి (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) వెల్లడించింది. 24.70 లక్షల మందికి రూ.16,753 కోట్లు ఐటి రిఫండ్ చేయగా, 1.38 లక్షల మంది కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులకు రిఫండ్ రూ.53,367కోట్లు చేసినట్టు సంస్థ తెలిపింది. కొత్త ఇఫైలింగ్ ప్లాట్‌ఫామ్‌తో పన్ను చెల్లింపుదారులు సమస్యలు ఎదుర్కొంటు న్నారు. దీంతో పలు టాక్స్‌పేయర్స్ ఇంకా ఆదాయం పన్ను రిటర్న్(ఐటిఆర్) దాఖలు చేయలేదు.

ఐటిఆర్ దాఖలు చేసిన 10 రోజుల్లోనే రిఫండ్ చేస్తారు, కానీ కొన్ని కారణంగా ఇది ఆలస్యమైంది. మీకు రిఫండ్ రాకపోయినట్లయితే ఐటి శాఖకు చెందిన వెబ్‌సైట్ (incometax.gov.in)లో స్టేటస్ చెక్ చేసుకోవాలి. పన్ను చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ చెల్లించినప్పుడు ఐటి డిపార్ట్‌మెంట్ ఐటి రిఫండ్ చేస్తుంది. వేతనం పొందేవారు తమ పెట్టుబడులు ఆధారాలు సంస్థకు అందించకపోయినట్లయితే యజమాని మూలం వద్ద ఎక్కువ పన్నును తీసివేస్తారు. బ్యాంక్ ఎఫ్‌డిలు లేదా బాండ్ల నుంచి వడ్డీ ఆధాయంపై టిడిఎస్ అధికంగా ఉన్నప్పుడు రిఫండ్స్ ప్రారంభిస్తారు.

CBDT Issues Tax Refunds worth Rs 70k cr

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News