- Advertisement -
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేసింది. ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన పలు అంశాలు, మద్యం వ్యాపారులతో ఆయనకున్న ఆరోపణలు, రాజకీయ నాయకులు, సాక్షులు తమ వాంగ్మూలాల్లో చేసిన ఆరోపణలపై ఆదివారం ఎనిమిది గంటలపాటు విచారించిన సిబిఐ ఆయనను అరెస్టు చేసింది.
దీంతో ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ సిబిఐ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. రేపు రౌస్ అవెన్యూ కోర్టులో సిసోడియాను సిబిఐ హాజరుపర్చనుంది. కాగా, లిక్కర్ స్కాం కేసులో ఇప్పటివరకు 12మందిని సిబిఐ అరెస్టు చేసింది.
- Advertisement -