Sunday, December 22, 2024

మణిపూర్ విద్యార్థుల హత్యకేసులో నలుగురు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల హత్యకు సంబంధించి నలుగురు నిందితులను సిబిఐ అరెస్టు చేసింది. మరో ఇద్దరు బాలికలను ఇంఫాల్‌లో అదుపు లోకి తీసుకుంది. భద్రతా కారణాల దృష్టా అరెస్టైన నలుగురిని వెంటనే అస్సాం లోని గువాహటికి తరలించారు. పోలీసులు, ఆర్మీ బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి ఇంఫాల్‌కు 51 కిమీ దూరం లోని ఏజెన్సీ జిల్లా చురాచంద్‌పూర్‌లో నిందితులను పట్టుకోగలిగారు. నిందితులను వెంటనే ఎయిర్‌పోర్టుకు తరలించారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న సిబిఐ బృందాలు సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో వారిని ఇంఫాల్ నుంచి అస్సాంకు తరలించారు. విద్యార్థుల హత్యకు కారణమైన నిందితులను అరెస్టు చేశామని సీఎం బీరేన్‌సింగ్ ట్విటర్‌లో ప్రకటించారు. అయితే హత్యకు గురైన మైనర్ల మృతదేహాలు మాత్రం ఇంకా దొరకలేదు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News