ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు చేసినట్లు ప్రకటించిన సిబిఐ
ఐపిసి 477,120బి, అవినీతి నిరోధక చట్టంలోని 7వ సెక్షన్
కింద నిర్బంధంలోకి తీసుకున్నట్లు వెల్లడి
నేడు రౌస్ అవెన్యూ కోర్టుకు.. కస్టడీ కోరనున్న సిబిఐ ప్రత్యేక
కోర్టులో దక్కని ఉపశమనం
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరే ట్ (ఇడి) అరెస్టు చేసిన బిఆర్‌ఎస్ ఎంఎల్ సి కవితను తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను ప్రత్యేక కోర్టు అనుమతితో సిబిఐ కస్టడీలోకి తీసుకుంది. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అ రెస్టు చేస్తున్నట్లు జైలు అధికారుల ద్వారా కవితకు దర్యాప్తు సంస్థ సమాచారం పంపింది. ఐపిసి 477, 120(బి) సహా అవినీతి నిరోధక చట్టంలోని ఏడో సెక్షన్ ప్రకారం అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఇందుకోసం రౌస్ అవె న్యూ కోర్టు నుంచి అను మతి తీసుకున్నట్లు సిబిఐ వెల్లడించింది.
శుక్రవారం ప్రత్యేక న్యాయస్థానంలో కవిత ను హాజరుపరచనున్న సిబిఐ, రిమాండ్ రిపోర్టు సమర్పించి ఆమెను కస్టడీకి కోరనుంది. ప్రత్యేక కోర్టు అనుమతిస్తే కేంద్ర కార్యాలయానికి కవితను తరలించి, ప్ర శ్నించనుంది. తీహార్ జైలులో ఉన్న తనకు బెయిల్ వ స్తుందని ఆశలు పెట్టుకున్న కవితకు, సిబిఐ అరెస్ట్‌తో ఊహించని పరిణామం ఎదురైంది. మద్యం విధానం రూపకల్పన కోసం అనేక ముడుపులు చేతులు మారాయని, ఈ పాలసీ రూపొందించిన ప్రైవేటు వ్యక్తులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చేలా వ్యవహరించా రంటూ తొలుత సిబిఐ కేసు నమోదు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు కేసు విచారణ జరుపుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థ, 2022 డిసెంబర్ 11న తొలుత హైదరాబాద్‌లోని కవితను ఆమె నివాసంలో మూడ్రోజుల పాటు విచారించింది.
ఢిల్లీ మద్యం విధా నం రూపకల్పన కేసులోనే గత నెల 15న కవితను ఇడి అరెస్టు చేసి, 10 రోజుల పాటు విచారించగా, ఆ తర్వా త జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా ఆమె తీహార్ జైలు లో ఉన్నారు. అటు కేసు దర్యాప్తులో భాగంగా శనివా రం కోర్టు అనుమతితోనే కవితను తీహార్ జైలులో సిబిఐ విచారించింది. సహ నిందితుడు బుచ్చిబాబు ఫోన్ నుం చి రికవరీ చేసిన వాట్సాప్ చాట్స్ ఆధారంగా ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీలో లిక్కర్ లాబీకి అనుకూలంగా వ్యవహరిం చేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్ల ముడుపులు చెల్లించినట్లు వచ్చిన ఆరోపణపైనా విచారించినట్లు తెలుస్తోంది. సిబిఐ దగ్గర ఉన్న ఆధారాలతో శుక్రవారం రౌస్ అవెన్యు కోర్టులో హాజరు పరిచి కస్టడీకి కోరనుంది.
కోర్టులో దక్కని రిలీఫ్.. నిరాకరించిన జడ్జి
సిబిఐ అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సిబిఐ అరెస్టుపై అత్యవసరంగా సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ బెంచ్ ముందు కవిత తరపు న్యా యవాదులు పిటిషన్ ఫైల్ చేశారు. కవితకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా సిబిఐ అరెస్ట్ చేసిందని కవిత తరఫు లాయర్లు రాణా, మోహిత్ రావు జడ్జి ఎదుట వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తన ఎదుట లిక్కర్ కేసుకు సంబంధించిన వాదనలు జరగలేదని ఆ కేసు వివరాలు తనకు తెలియదని తెలిపారు.
ఈ కేసులో తాను ఎలాంటి రీలీఫ్ ఇవ్వలేనని చెప్పారు. సిబిఐ కేసు గురించి ఎలాంటి సమాచారం లేదని, ఇక్కడ అత్యవసర జడ్జిమెంట్లపై మాత్రమే వాదనలు జరుగుతున్నాయని తెలిపింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు రెగ్యులర్ కోర్టు ముందు పిటిషన్ ఫైల్ చేయమని న్యాయమూర్తి సూచించారు. కవిత న్యాయ వాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను మెజిస్ట్రేట్ కావేరి భవేజా ధర్మాసనానికి సిబిఐ కోర్టు బదిలీ చేసింది. దీంతో ఈ పిటిషన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు విచారణకు వస్తుందని భావిస్తున్నారు.