Sunday, December 22, 2024

రూ.10 లక్షల లంచం కేసు: ఐటి ప్రిన్సిపల్ కమిషనర్‌ను అరెస్టు చేసిన సిబిఐ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: వివిధ అసెస్సీల నుంచి రూ. 10 లక్షల మేరకు లంచం తీసుకున్నారన్న ఆరోపణపై ఆదాయపు పన్ను శాఖ (పాట్నా, ధన్‌బాద్) ప్రిన్సిపల్ కమిషనర్‌ను, మరి నలుగురిని సిబిఐ మంగళవారం అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రూ. 10 లక్షల మేరకు ముడుపుల బదలాయింపు సమయంలో నలుగురు ప్రైవేట్ వ్యక్తులతో పాటు ఐటి ప్రిన్సిపల్ కమిషనర్ సంతోష్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు వారు తెలియజేశారు. తన అధికార పదవిని దుర్వినియోగం చేస్తూ వివిధ ఐటి అసెస్సీలకు అనుచిత లబ్ధి చేకూర్చడానికి తన పరిధిలోని ఆ అసెస్సీల నుంచి ముడుపులు కోరుతూ, అందుకుంటున్నారన్న ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన ఒక ఎఫ్‌ఐఆర్‌లో కుమార్‌ను సిబిఐ అరెస్టు చేసిందని అధికారులు వివరించారు.

‘ఐటి ప్రిన్సిపల్ కమిషనర్ (పాట్నా, ధన్‌బాద్) తరఫున పలువురు ఏజెంట్లు పని చేస్తున్నారని కూడా ఆరోపణ వచ్చింది’ అని సిబిఐ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలియజేశారు. అరెస్టుల తరువాత పాట్నా, ధన్‌బాద్, నోయిడాలలో 21 చోట్ల సిబిఐ సోదాలు నిర్వహించి, నేర సంబంధిత పత్రాలు, వస్తువులను స్వాధీనం చేసుకున్నదని అధికారులు తెలిపారు. నిందితులను బుధవారం పాట్నాలో సిబిఐ ప్రత్యేక న్యాయమూర్తి కోర్టులో హాజరు పరచనున్నట్లు సిబిఐ అధికార ప్రతినిధి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News