Sunday, December 22, 2024

మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో ప్రధాన సూత్రధారి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఇటీవల ఇద్దరు మైయిటీ విద్యార్థుల హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న యువకుడిని సిబిఐ అదుపులోకి తీసుకుంది. పూణెలో అరెస్ట్ చేసినట్లు శుక్రవారంనాడు అధికారులు తెలిపారు. సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం బుధవారం పూణె నుండి పౌలున్‌మాంగ్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచేందుకు గౌహతికి తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. ప్రత్యేక కోర్టు అతన్ని అక్టోబర్ 16 వరకు సిబిఐ కస్టడీకి పంపింది. ఈ కేసులో పావోలున్‌మాంగ్ ప్రధాన సూత్రధారి అని సిబిఐ అనుమానిస్తోంది. అంతకుముందు ఈ హత్యతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల్ని అక్టోబర్ 1న చూరచంద్ పూర్ ప్రాంతంలో సైన్యం, మణిపూర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. పట్లుబడిన వారిలో ఇద్దరు పురుషులు పావోయిన్‌లున్ హీకిప్, స్మాల్‌సామ్ హకిప్‌లతో పాటు ఇద్దరు మహిళలు లింగ్‌నీ చాంగ్ బైటెకుకి, టిన్నెల్ హింగ్ హెన్‌తాంగ్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News