Monday, December 23, 2024

ఒడిషా రైలు దుర్ఘటన కేసు: ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఒడిషాలోని బాలాసోర్‌లో జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఘోర రైలు ప్రమాద ఘటనలో తొలి అరెస్టులు జరిగాయి. సేఫ్టీ కమిషన్ నివేదిక నేపధ్యంలో శుక్రవారం ముగ్గురు రైల్వే ఉద్యోగులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం సంబంధిత అధికారులు తెలిపారు. బాలాసోర్ జిల్లాలో రైల్వే ఉద్యోగులను కేసుకు సంబంధించి అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వీరిలో సిగ్నల్స్ విషయాల సీనియర్ సెక్షన్ ఇంజనీరు అరుణ్‌కుమార్ మెహంతా, సెక్షన్ ఇంజినీర్ మెహమ్మద్ అమీర్ ఖాన్ , టెక్నిషియన్ పప్పు కుమార్ ఉన్నారని వెల్లడించారు. వీరిని హత్యానేరంతో సమానం కాని నేరం పరిధిలో ఐపిసి సెక్షన్లు 304 కింద అదుపులోకి తీసుకున్నారు.

బాలాసోర్ జిల్లాలోని బహానాగా బజార్ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ప్రమాదంలో 293 మంది మృతి చెందారు. ఇప్పటికీ పలువురు గాయాలతో ఉన్నారు. సిగ్నలింగ్ తప్పిదాలతో ఈ ఘటన జరిగిందని రైల్వేకు నివేదిక అందింది. దీనితో ఇప్పుడు సంబంధిత సాంకేతిక విషయాల సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని రైల్వే పోలీసు అధికారులు విచారిస్తారు. నిజాల నిగ్గు తేలుస్తారు. ఇప్పుడు అరెస్టు అయిన వ్యక్తులు తమ విధుల పట్ల నిర్లక్షం వహించారని, సిగ్నల్ తప్పిదాలతో ఘోర ప్రమాదం జరుగుతుందని వీరికి తెలుసునని, అయితే ప్రమాదాలు సృష్టించాలనే ఉద్ధేశం వీరికి లేదని అధికారులు నిర్థారించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News