Wednesday, January 22, 2025

అవినాష్ రెడ్డికి మరోసారి సిబిఐ నుంచి పిలుపు

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దర్యాప్తు కీలక దశకు చేరుకున్న దశలో ఈ కేసుకు సంబంధించి కడపకు చెందిన వైఎస్‌ఆర్‌సిపి ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డిని సిబిఐ అధికారులు శుక్రవారం మరోసారి ప్రశ్నించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సోదరుడైన అవినాష్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో సిబిఐ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. సిబిఐ ముందు ఆయన హాజరుకావడం ఇది రెండవసారి. అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని కూడా గురువారం తమ ఎదుట హాజరుకావాలని సిబిఐ ఆదేశించగా తనకు కొంత వ్యవధి కావాలని ఆయన కోరినట్లు సమాచారం.

ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో బుధవారం సిబిఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో సంచలనాత్మక విషయాలను బయటపెట్టింది. ఈ కేసులో నిందితుడైన సునీల్ యాదవ్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించిన సిబిఐ వివేకానంద రెడ్డి హత్యకు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, వారి అనుచరుడు డి శివశంకర్ రెడ్డి కుట్ర పన్నినట్లు ఆరోపించింది. హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసిన రెండు రోజులకే మరోసారి అవినాష్ రెడ్డిని సిబిఐ పిలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News