Monday, December 23, 2024

అశోక్ గెహ్లాట్ సోదరుడిపై సిబిఐ కేసు

- Advertisement -
- Advertisement -

CBI case against Ashok Gehlot's brother

అగ్రసేన్ గెహ్లాట్ నివాసంలో సోదాలు

న్యూఢిల్లీ: రైతులకు ఉద్దేశించిన ఎరువులను అక్రమంగా దారి మళ్లించారన్న ఆరోపణలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్‌తోపాటు మరో 14 మందిపై సిబిఐ కేసులు నమోదుచేసింది. అగ్రసేన్ గెహ్లాట్‌కు చెందిన జోధ్‌పూర్ నివాసంతోపాటు మూడు రాష్ట్రాలలోనిఇ 16 ప్రదేశాలలో సిబిఐ సోదాలు జరిపినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. అగ్రసేన్‌తోపాటు మరో 14 మంది పేర్లను నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లోని 17 ప్రదేశాలలో సోదాలు నిర్వహించడానికి 60 మందికి పైగా సిబిఐ అధికారులు రంగంలోకి దిగినట్లు అధికారులు చెప్పారు. అ పరిణామాలపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందిస్తూ తాను ఇటీవలే సిబిఐ డైరెక్టర్, ఇడి, ఆదాయం పన్ను శాఖ చైర్మన్ అపాయింట్‌మెంట్ కోరానని తెలిపారు. జూన్ 13న తాను సమయం కోరగా 15న కేసు నమోదు చేశారని, 17న దాడులు జరిగాయని ఆయన చెప్పారు. ఇదేం తీరంటూ ఆయన మండిపడ్డారు. ఢిల్లీలో తాను చురుకుగా ఉన్నా లేక రాహుల్ ఉద్యమంలో పాల్గొన్నా తన సోదరుడిపై ప్రతీకారం తీర్చుకోవడమేమిటని ఆయన ప్రశ్నించారు. 2020లో తన ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం ఏర్పడినపుడు కూడా తన సోదరుడి ఇంటిపై ఇడి దాడులు జరిపిందని ఆయన గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News