న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సిబిఐ ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సీనియర్ అధికారిపై, స్థానిక క్లారిడ్జెస్ హోటల్ అధినేతపైకేసు పెట్టింది. ఈ స్కామ్‌పై ఇప్పుడు సిబిఐ దర్యాప్తు సాగుతోంది. ఇందులో భాగంగా ఇప్పుడు ఇడి ఎడి అయిన పవన్ ఖత్రీ, హోటల్స్, రిసార్ట్ చీప్ విక్రమాదిత్య సింగ్, ఎయిర్ ఇండియా ఉద్యోగి దీపక్ సంగ్వాన్‌పై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తు క్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి సిసోడియా వంటి ప్రముఖులపై దర్యాప్తు సాగుతోంది. కేసులో నిందితులు ఒకరికి సహకరించేందుకు పవన్ ఖత్రి ఇతరులు సహకరించినట్లు తెలియడంతో సిబిఐ ఇప్పుడు వారిపై విచారణకు రంగం సిద్ధం చేసుకుంది. లిక్కర్ వ్యాపారి అమన్‌దీప్ ధాల్ తనపేరు రాకుండా చేసుకునేందుకు ఇడి అధికారులను లోపాయికారిగా సంప్రదించినట్లు
ఈ క్రమంలో సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఖత్రీ సదరు వ్యక్తి నుంచి రూ ఐదు కోట్లు డిమాండ్ చేసి తీసుకున్నట్లు పసికట్టారు. ఇడి దర్యాప్తులో తమ పేర్లు రాకుండా చేసుకునేందుకు ధాల్, ఆయన తండ్రి బీరేందర్ పాల్ సింగ్ ఐదు కోట్ల లంచాన్ని ఛార్టెడ్ అకౌటెంట్ ప్రవీణ్ వాట్స్ ద్వారా పంపించినట్లు ఫిర్యాదులో తెలిపారు. తనకు ఖత్రీని ఎయిర్ ఇండియా ఉద్యోగి సంగ్వాన్ పరిచయం చేశారని వాట్స్ తెలిపారు. ముందుగా ఇడి అధికారికి రూ 50 లక్షలు చెల్లించినట్లు , ఏదో విధంగా స్కామ్‌లో ధాలి పేరు రాకుండా చూడాలని తెలిపినట్లు వెల్లడైంది. వ్యవహారం చివరికి ఇడి ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీనితో సిబిఐకి దీనిని ముందుగా తెలియచేశారు. వ్యాపారి పేరు రాకుండా చేసేందుకు రిసార్ట్ యజమాని కూడా చొరవ తీసుకున్నట్లు వెల్లడైంది.