Monday, December 23, 2024

పాస్‌పోర్టు కుంభకోణం: బెంగాల్, సిక్కింలో సిబిఐ సోదాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నకిలీ పత్రాలపై పాస్‌పోర్టులు జారీచేశారని ఆరోపిస్తూ 24 మంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ వ్యక్తులపై కేసులునమోదు చేసిన సిబిఐ శనివారం పశ్చిమ బెంగాల్, గ్యాగ్‌టాక్‌లోని 50 ప్రదేశాలపై దాడులు నిర్వహిస్తోంది. గ్యాంగ్‌టక్‌లో పనిచేస్తున్న ఒక అధికారితోపాటు ఒక దళారీని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ముడుపులు తీసుకుని నకిలీ పత్రాల ఆధారంగా ప్రవాసులతోసహా అనర్హులకు పాస్‌పోర్టులు జారీచేశారని ఆరోపిస్తూ 16 మంది ప్రభుత్వ అధికారులతోసహా మొత్తం 24 మంది వ్యక్తులపై సిబిఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. కోల్‌కతా,సిలిగురి, గ్యాంగ్‌టక్‌తోపాటు ఇతర ప్రదేశాలలో సోదాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News