Saturday, December 21, 2024

మహువా మొయిత్రా నివాసంలో సిబిఐ సోదాలు

- Advertisement -
- Advertisement -

పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రా పై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈమేరకు శనివారం కోల్‌కతా లోని ఆమె నివాసంతోపాటు ఇతర నగరాల్లో ఆమెకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ కేసులోబీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు మేరకు మహువా పై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని లోక్‌పాల్ ఆదేశించింది. ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సీబీఐ సోరాలు చేపట్టింది.

అదానీ గ్రూపును, ప్రధాని మోడీని లక్షంగా చేసుకునేలా ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీ నుంచి మహువా రూ. 2 కోట్లతో పాటు ఖరీదైన బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు చేశారు. దీనిపై లోక్‌సభ నైతిక విలువల కమిటీ విచారణ జరిపి నివేదిక సమర్పించగా, స్పీకర్ బహిష్కరణ వేటు వేశారు. ఈ బహిష్కరణ వేటుపై మహువా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఇదే వ్యవహారానికి సంబంధించిన విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఎఫ్‌ఇఎంఎ ) నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News