- Advertisement -
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతి ఇచ్చింది. తన కుమార్తె పుట్టిన రోజు కోసం యూకె వెళ్లేందుకు జగన్ కోర్టు అనుమతి కోరారు. కాగా యూకె వెళ్లే ముందు పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మొబైల్ నంబరు, మెయిల్ వివరాలు కోర్టుకు, సిబిఐకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాక జగన్ కు కొత్త కాల పరిమితితో పాస్ పోర్టు జారీ చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
- Advertisement -