మనతెలంగాణ/హైదరాబాద్: ఎపి రాజ్యసభ సభ్యుడు ఎంపి విజయసాయిరెడ్డికి బెయిల్ రద్దు పిటిషన్‌పై శనివారం నాడు సిబిఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని సిబిఐను న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 10న విజయసాయి బెయిల్ రద్దు పిటిషన్ కోర్టు విచారణ జరపనుంది. జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఎంపి రఘురామకృష్ణరాజు సిబిఐ కోర్టును కోరారు. ఎంపీగా కేంద్ర హోం, ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయాల్లో అధికారులను తరచుగా కలిసే విజయసాయిరెడ్డి తనకు కేంద్ర మంత్రులతో సన్నిహిత సంబంధాలున్నాయనే విధంగా చిత్రీకరించి సాక్షుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా భయం కలిగిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి ఎంపీ కాగానే జగన్ అక్రమాస్తుల కేసుల ప్రధాన దర్యాప్తు అధికారిగా వ్యవహరించిన అధికారిని సిబిఐ జెడి చేయవద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర హోం మంత్రికి లేఖ రాశారని, ఇది స్వేచ్ఛాయుత విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆరోపించారు.
విజయసాయిరెడ్డికి సిబిఐ కోర్టు నోటీసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -