- Advertisement -
న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆదివారం తనను ప్రశ్నించే తేదీని మరోనాటికి వాయిదా వేయమని కోరడంతో ఆయనను ప్రశ్నించే తేదీ వాయిదా పడింది. తదుపరి తేదీని సిబిఐ తర్వాత ప్రకటించనున్నది. ఆప్ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ఆర్థిక మంత్రి కూడా అయిన సిసోడియాను సిబిఐ ప్రశ్నించేందుకు పిలిచింది. కాగా తనకు వారం రోజుల గడువు ఇవ్వాలని ఆయన కోరారు.
2021 నవంబర్‌లో అమలుచేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అనేక అవకతవకలు జరిగాయని సిబిఐ ఆరోపిస్తోంది. దానిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె.సక్సేనా దర్యాప్తుకు కూడా ఆదేశించారు. కాగా దేశరాజధానిలో మద్యం అమ్మకం తీరునే మార్చేసిందా పాలసీ. కానీ దానిని 2022 జులై 31న ఉపసంహరించారు.
- Advertisement -