Monday, December 23, 2024

అలహాబాద్ రిటైర్డ్ జడ్జిపై సిబిఐ కేసు..

- Advertisement -
- Advertisement -

లక్నో: లెక్కల్లోకి రాని, ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎన్‌ఎన్ శుక్లాపై సిబిఐ కేసు నమోదు చేసింది. ఆయనతో పాటు భార్య, బావమరిదిలపై కూడా కేసులు దాఖలు అయ్యాయి. 2014 2019 మధ్యలలో ఈ మాజీ న్యాయమూర్తి అక్రమ ఆస్తులు సంపాదించుకున్నట్లు అభియోగపత్రాలలో తెలిపారు.

పలు ఫ్లాట్లు, స్థలాలు కోట్లాది రూపాయల విలువైనవి ఆయన రెండో భార్య సుచిత తివారీ, బావమరిది సైదీన్ తివారీ పేరిట కొనుగోలు చేశారని, లక్నోలోని గల్ఫ్‌సిటీలో ఓ విల్లా తీసుకున్నారని సిబిఐ తెలిపింది. ఈ న్యాయమూర్తి నికర నిజ ఆదాయంతో పోలిస్తే వీటి విలువ 165 శాతం ఎక్కువ అని సిబిఐ ఈ మాజీ న్యాయమూర్తిపై కేసుకు దిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News