Monday, December 23, 2024

శ్రీలక్ష్మిపై సుప్రీంకోర్టులో సిబిఐ పిటిషన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జగన్ అక్రమాస్తుల కేసు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని వెంటాడుతోంది. తాజాగా సిబిఐ ఈ కేసులో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఓబులాపురం ఇనుప రజను కంపెనీకి సంబంధించిన గనుల కేటాయింపులో శ్రీలక్ష్మికి పాత్ర ఉన్నట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ఆమెను విచారించాల్సిందేనని సిబిఐ డిమాండ్ చేస్తోంది. ఇదిలావుండగా శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఇటీవలె ఊరట లభించింది. కేసు నుంచి ఆమె పేరును తొలగించింది. ఈ నేపథ్యంలోనే సిబిఐ సుప్రీంకోర్టులో తాజా పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News