Monday, December 23, 2024

ల్యాండ్ జాబ్ స్కామ్..లాలూ ఫ్యామిలీపై ఇడి ఛార్జీషీట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉద్యోగాలకు బదులుగా నగదు సంబంధిత స్కామ్‌లో సిబిఐ సోమవారం ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవీ, తేజస్వీ యాదవ్‌లపై ఛార్జీషీట్ దాఖలు చేసింది. ఈ అభియోగపత్రంలో మరో 14 మంది పేర్లు కూడా జతపర్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ అప్పట్లో కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ ల్యాండ్ ఫర్ స్కామ్ జరిగింది.

ఇంతకు ముందు ఈ కేసులో దాఖలు అయిన ఛార్జిషీట్ క్రమంలో తమకు దక్కిన పత్రాలు, సాక్షాలను క్రోడీకరించుకుని ఇప్పుడు ఈ రెండో ఛార్జీషీట్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత కేసులో తొలి నివేదిక ఇప్పటికే వెలువడింది. అయితే ఈ స్కామ్‌లో నిందితులైన వారి పాత్ర గురించి సరైన నిర్థారణలు పూర్తి కాకపోవడంతో ఇప్పుడు ఈ రెండో ఛార్జిషీటు దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News